లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 11: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 11:8

వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.

లేవీయకాండము 11:24

వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 11:25

వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

లేవీయకాండము 5:2

మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్ర మృగ కళేబరమేగాని అపవిత్ర పశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగును.

లేవీయకాండము 11:39

మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

సంఖ్యాకాండము 19:11

ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడై యుండును.

1సమూయేలు 20:26

అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై యుండునేమో, అతడు అపవిత్రుడై యుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.