సంఖ్యాకాండము 33: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.
నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి,
అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.
యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ నెక్కిరి.
మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.
ఇశ్రాయేలీయులు యహకానీయులదైన బెయేరోతునుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అక్కడ అహరోను చనిపోయి పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఎలియాజరు అతనికి ప్రతిగా యాజకుడాయెను.
నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనులయొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజనులయొద్దకు చేరుదువు.
ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనాను దేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు.
మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.
అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను.
నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి,
మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.
నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు.
హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయీలో హతముచేసిన తరువాత