లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 85

క్రాస్-రిఫరెన్స్‌లు

" ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 22:14

ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చి యుంచితిని; నీవు ఇంకను సంపాదించుదువుగాక.

1దినవృత్తాంతములు 29:4

గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను

1దినవృత్తాంతములు 29:7

మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.

ఎజ్రా 8:25

మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.

ఎజ్రా 8:26

వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,

సంఖ్యాకాండము 7:13

అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

జెకర్యా 14:20

ఆ దినమున గుఱ్ఱముల యొక్క కళ్లెములమీద యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును.

మత్తయి 14:8

అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకిప్పించుమని యడిగెను.