లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 7: 86

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగ మేకపిల్లలు పండ్రెండు,"

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 7:50

మేలిమి బంగారపు పాత్రలను, కత్తెరలను, గిన్నెలను, ధూపకలశములను, అంతర్మందిరమను అతి పరిశుద్ధమైన స్థలముయొక్క తలుపులకును మందిరమను ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బందులను, వీటన్నిటిని చేయించెను, ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మరియు సొలొమోను తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను.

మత్తయి 2:11

తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.