1రాజులు 7: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్లును దేవదారు కఱ్ఱలును కలవు."
సంబంధిత రిఫరెన్స్‌లు
క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది.
ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు.
యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
ఈ కట్టడములన్నియు పునాది మొదలుకొని గోడ చూరువరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు, రంపములచేత కోయబడినట్టివియు, మిక్కిలి వెలగలరాళ్లతో కట్టబడెను; ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను.