1రాజులు 7: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు అతడు పది యిత్తడి స్తంభములు చేసెను; ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు, నాలుగు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు కలిగి యుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి.
మరియు అతడు యెహోవా మందిరమునకు సొలొమోను చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లను తీసికొనిపోయెను. ఈ యిత్తడి వస్తువులయెత్తు లెక్కకు మించియుండెను.
మట్లు, మట్లమీదనుండు తొట్లు,
మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు గొనిపోయిరి.
రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన రెండు స్తంభములను సముద్రమును మట్లక్రిందనుండిన పండ్రెండు ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికున్న ఇత్తడి యెత్తువేయుటకు అసాధ్యము.
పది స్తంభములను, స్తంభములమీద పది తొట్లను,
మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీదనున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.