లేఖనాలను అన్వేషించండి

1రాజులు 7: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై యుండెను; ఇతని తండ్రి తూరు పట్టణపువాడగు ఇత్తడి పనివాడు. ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞగల బుద్ధిమంతుడును ఇత్తడితో చేయు సమస్తమైన పనులలోను బహు చమత్కారపు పనివాడునై యుండెను; అతడు సొలొమోనునొద్దకు వచ్చి అతని పని అంతయు చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 2:14

అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైనవాడు, అతడు బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను రాళ్లతోను మ్రానులతోను ఊదా నూలుతోను నీలి నూలుతోను సన్నపు నూలుతోను ఎఱ్ఱ నూలుతోను పనిచేయగల నేర్పరియైనవాడు. సకలవిధముల చెక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైన దావీదు అను నా యేలినవాడు నియమించిన ఉపాయశాలులకును సహకారియై వాటన్నిటిని నిరూపించుటకు తగిన సామర్థ్యము గలవాడు.

2దినవృత్తాంతములు 4:16

పాత్రలు, బూడిదెనెత్తు చిప్పకోలలు, ముండ్లకొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞ ప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.

నిర్గమకాండము 31:2

చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.

నిర్గమకాండము 31:3

విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై

నిర్గమకాండము 31:4

రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

నిర్గమకాండము 31:5

సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసియున్నాను.

నిర్గమకాండము 31:6

మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసితిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను.

నిర్గమకాండము 35:30

మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి;

నిర్గమకాండము 35:31

యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును,

నిర్గమకాండము 35:32

రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును,

నిర్గమకాండము 35:33

విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు.

నిర్గమకాండము 35:34

అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.

నిర్గమకాండము 35:35

చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పనియైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

నిర్గమకాండము 36:1

పరిశుద్ధస్థలముయొక్క సేవనిమిత్తము ప్రతివిధమైన పనిచేయ తెలిసికొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బెసలేలును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరును యెహోవా ఆజ్ఞాపించిన అంతటిచొప్పున చేయుదురనెను.

నిర్గమకాండము 36:2

బెసలేలును అహోలీయాబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరిని మోషే పిలిపించెను.

నిర్గమకాండము 36:8

ఆ పని చేసినవారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును పది తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో చిత్రకారుని పనియైన కెరూబులు గలవాటినిగా చేసెను.

యెషయా 28:26

వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు.

నిర్గమకాండము 31:3

విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై

నిర్గమకాండము 31:4

రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును

నిర్గమకాండము 35:35

చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ్ర రక్తవర్ణములతోను సన్ననారతోను బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్తవిధములైన పనులు, అనగా ఏ పనియైనను చేయువారియొక్కయు విచిత్రమైన పని కల్పించు వారియొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు.

1దినవృత్తాంతములు 22:15

మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసె పనివారును వడ్రవారును ఏవిధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.

2దినవృత్తాంతములు 2:7

నా తండ్రియైన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నాయొద్ద ఉంచిన ప్రజ్ఞగలవారికి సహాయకుడైయుండి, బంగారముతోను వెండితోను ఇత్తడితోను ఇనుముతోను ఊదా నూలుతోను ఎఱ్ఱ నూలుతోను నీలి నూలుతోను చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యునొకని నాయొద్దకు పంపుము.

సామెతలు 8:12

జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలిసికొనుట నాచేతనగును.