1రాజులు 7: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆ విధముగానే కట్టించెను. మరియు సొలొమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపమువంటి యొక నగరును కట్టించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెషయా నడిమిశాలలోనుండి అవతలకు వెళ్లకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను.
తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లిచేసికొని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టు ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను.
ఫరో కుమార్తె దావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.
ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను.
అతని భార్యయైన యెహూదీయా గెదోరునకు ప్రధానియైన యెరెదును శోకోకు ప్రధానియైన హెబెరును జానోహకు ప్రధానియైన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసికొనిన ఫరో కుమార్తెయైన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే.
నేను గొప్ప పనులు చేయ బూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.