సంఖ్యాకాండము 1: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపు ధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.
ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడునైన ఎలీషామా.
ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.
తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా,
ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ.
అతని సమీపమున మనష్షే గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.
ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీయేలు.
పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్రసైన్యమునకు అధిపతి.
ఇదిగో నేను ఐగుప్తునకు నీయొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను షిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై యుందురు.
యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను.
షల్లూము యెకమ్యాను కనెను, యెకమ్యా ఎలీషామాను కనెను.
అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపు గదులును ప్రతిష్ఠితములైనవి, వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.