లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 1: 42

క్రాస్-రిఫరెన్స్‌లు

" నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 30:7

రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను.

ఆదికాండము 30:8

అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను.

ఆదికాండము 46:24

నఫ్తాలి కుమారులైన యహనేలు గూనీ యేసెరు షిల్లేము.

ఆదికాండము 49:21

నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును.

సంఖ్యాకాండము 2:29

అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.

సంఖ్యాకాండము 2:30

అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది.

సంఖ్యాకాండము 26:50

వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబది యయిదువేల నాలుగువందలమంది